నేటిఏపి స్పెషల్ : ఉద్యమనేత.. తెలంగాణ ముఖ్యమంత్రి గురించి పది నిజాలు ఇవే..!

Saturday, April 2nd, 2016, 05:54:50 PM IST


తెలంగాణ రాష్ట్రం గురించి పాటుబడిన వ్యక్తులు ఎందఱో ఉన్నారు. అయితే, తెలంగాణ కోసం ఒక పార్టీని స్థాపించి.. తెలంగాణ కోసం పోరాటం చేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడమే జీవితాశయంగా భావించిన వ్యక్తి కెసిఆర్. కెసిఆర్ నాయకత్వంలోని తెరాస పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఆ మహావ్యక్తి గురించిన కొన్ని సత్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. కెసిఆర్ ఫిబ్రవరి 17, 1954 వ సంవత్సరంలో సిద్ధిపేట మండలం మెదక్ జిల్లాలోని చింతమండక గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచి కెసిఆర్ కు సాహిత్యంపై మక్కువ ఎక్కువతో తెలుగు లిటరేచర్ చేశారు.

2. అన్న ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ సమయంలో కెసిఆర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత కెసిఆర్.. కాంగ్రెస్ పార్టీ నేత మదన్ మోహన్ పై పోటీచేశారు. అయితే ఆ ఎన్నికలలో కెసిఆర్ ఓటమిపాలయ్యారు.

3. తరువాత అంటే 1985 నుంచి కెసిఆర్ వరసగా ఐదుసార్లు వరసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాలుగు సార్లు 1985 నుంచి 1999 వరకు నాలుగుసార్లు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి అలాగే 2014 లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగాగెలిచారు.

4. మెదక్ నుంచి రెండుసార్లు కెసిఆర్ లోక్ సభకు ఎంపికయ్యారు. అయితే, తెలంగాణ ఉద్యమంలో భాగంగా కెసిఆర్ తన ఎంపి పదవికి రెండు సార్లు రాజీనామా చేశారు.

5. తెలంగాణ ఉద్యమసమయంలో కెసిఆర్ 9 రోజులపాటు ఆమరణనిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగానే 2010లో ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తున్నట్టు యూపీఏ ప్రకటించింది. కాని, ఆ ప్రకటనను అమలు చేయడానికి నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్నది.

6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కెసిఆర్ రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. 1987-1988 మధ్యకాలంలో హొమ్ శాఖ మంత్రిగా, 1997-1999 మధ్యకాలంలో రవాణాశాఖ మంత్రిగా కెసిఆర్ పనిచేశారు. కేంద్రంలో సైతం కెసిఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

7. తెలుగుదేశం పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నాక కెసిఆర్ ఏప్రిల్ 27, 2001 వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ కోసం తెరాస పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఎన్నో తెలంగాణకోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ముందుండి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు

8. కెసిఆర్ ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ ఎన్నో కమిటీలలో సభ్యులుగా ఉండి చురుకైన పాత్రను పోషించారు.

9. కెసిఆర్ కు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా ఎంతో ఇష్టం. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ఎన్నో పాటలు రాశారు.

10. కెసిఆర్ కల తెలంగాణ రాష్ట్ర సాధన.. రాష్ట్రాన్ని సాధించుకున్నాక జరిగిన ఎన్నికలలో తెరాస పార్టీ 63 అసెంబ్లీ, 11 లోక్ సభ సీట్లనుగెలుచుకున్నారు. ఇక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్. సౌత్ లో హిందీలో పట్టున్న ముఖ్యమంత్రి కూడా కెసిఆర్. మర్రి చెన్నారెడ్డి తరువాత.. హిందీపై అంతటి పట్టున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కావడం ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించదగ్గ విషయం.