నిర్మల్ లో దారుణం.. పదేళ్ల బాలికపై రాక్షసత్వం చూపిన కామాందుడు!

Monday, June 18th, 2018, 11:16:43 AM IST

మహిళల కోసం ప్రభుత్వాలు కోర్టులు పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇంకా వారిపై దాడులు ఆగడం లేదు. గత కొన్ని రోజుల క్రితమే అసిఫా లాంటి చిన్నారి ఘటన ప్రపంచాన్ని కదిలించినప్పటికీ ఇంకా అఘాయిత్యాల సంఖ్య తగ్గడం లేదు. ఇటీవల నిర్మల్ జిల్లాలో అదే తరహాలో జరిగిన అత్యాచార ఘటన అందరిని కలచివేసింది. మామయ్య అని పిలిచే వ్యక్తే చిన్నారిని బలికొన్నాడు.

అసలు వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా సొన్ గ్రామంలో పదేళ్ల బాలికపై హత్యాచారం జరిపిన ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. 5వ తరగతి చదువుతున్న పదేళ్ల బాలిక ఇంట్లో కనిపించడం లేదని శనివారం ఇంట్లో వాళ్లు వెతుకులాట ప్రారంభించారు. గ్రామస్తులు కూడా చుట్టూ పక్కల వెతుకులాట ప్రారంబించారు. ఆదివారం పోలీసులు రంగంలోకి దిగగా అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ (30) అనే వ్యక్తి చిన్నారిని బైక్ పై తీసుకెళ్లినట్లు తెలిసింది.

పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. తన స్నేహితురాలి మామయ్య కావడంతో ఆ చిన్నారి అతన్ని అలానే భావించేది. శనివారం అతను చిన్నారిని ఉరికి చివరలో ఉన్న ఒక నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. గ్రామస్థులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నడిరోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన తరువాత రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.