ప్రపంచంలోనే అతిపెద్ద నరబలి

Friday, April 27th, 2018, 05:03:45 PM IST

ప్రపంచంలో నరబలి అనేది ప్రతి చోట ఉందని కొన్ని సంఘటనలు నిరూపించాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయ. రీసెంట్ గా బయటపడ్డ కొన్ని అస్థి పంజరాలు ద్వారా శాస్త్ర వేత్తలు ఒక సరికొత్త విషయాన్నీ కనుగొన్నారు. చరిత్రలో అతిపెద్ద బాలల నరబలి జరిగినట్లు నిర్దారణకు వచ్చారు. ఇటీవల నేషనల్‌ జాగ్రఫీ చానెల్‌ ద్వారా ఆ విషయం ప్రపంచానికి మొత్తం తెలిసింది. సోషల్ మీడియాలో కూడా అందుకు సంబందించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

2011 ఉత్తర పెరూ సముద్ర తీరంలో కొన్ని భయంకర ఆస్థిపంజరాలు బయటపడ్డాయి. స్థానిక ప్రజలు ఆ ఘటనను చూసి భయానికి గురవ్వడంతో వాటిపై ఏళ్ల తరబడి శాస్త్రవేత్తలు పరీక్షలు జరుపగా ఓ సమాధానం దొరికింది. వందల మంది చిన్నారులను అతి దారుణంగా చంపేశారని తేలింది. వారి గుండెలను బయటకు తీసి బలి ఇచ్చినట్లు పరిశోధనలో తేలింది. అంతే కాకుండా దక్షిణ అమెరికాలో కనిపించే అరుదైన లామాస్‌ అనే 200 జీవులను కూడా బలిచ్చినట్లు పురావస్తు శాఖ వారు గుర్తించారు ఈ కార్బన్‌తో పాటు కార్బన్‌ డేటింగ్‌ పద్దతి ద్వారా ఆస్థిపంజరాల వయసు సుమారు 550 ఏళ్లదని తేల్చారు. అంటే 1400-1450ల కాలంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.