ఒక్క రోజు సరదాల ఖర్చు 180కోట్లు!

Friday, January 2nd, 2015, 10:57:19 AM IST


నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరవాసులు పెట్టిన ఖర్చు అక్షరాల 180కోట్లు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం ఒక్క రాత్రి జరుపుకునే విందు, వినాదాల కోసం 180కోట్ల రూపాయలను అలవోకగా ఖర్చు పెట్టారు మన నగరవాసులు. ఇక ఫేమస్ రెస్టారెంట్ల దగ్గర నుండి సొంత ఇళ్ళల్లో జరుపుకునే చిన్న చిన్న పార్టీల దాకా పెట్టిన ఖర్చు ఈ మొత్తం కిందకే వస్తోందట.

కాగా న్యూఇయర్ సంబరాలలో కేవలం మద్యంకోసమే 80కోట్ల రూపాయల దాకా హైదరాబాదీలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే కేకులు, కూల్ డ్రింక్స్ కోసం మరో 15కోట్లు, ఆహార పదార్ధాల కోసం 25కోట్ల రూపాయలను నగరవాసులు ఖర్చు పెట్టారు. ఇక సెలబ్రిటీలతో చిందులు వేసే ఈవెంట్ల కోసం 60కోట్ల రూపాయలను హైదరాబాదీలు ఖర్చు పెట్టారంటే ఈ నూతన సంవత్సర వేడుకలను ఎంత ఘనంగా నిర్వహించుకున్నారో తెలుస్తోంది. మరి ఇందంతా చూస్తుంటే దానానికి ఒప్పని మనసు దండగకు ఒప్పుతుందననే సామెత నిజమని అనిపించక మానదు కదా!