ప్రేయసి కళ్ళ ముందే 5వ అంతస్థు నుంచి దూకి యువకుడు ఆత్మహత్య..వైరల్..!

Saturday, December 1st, 2018, 05:09:07 PM IST

నిన్న బెంగళూరు ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది.రోషన్ అనే 23 ఏళ్ల యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరచగా ఆమె తన ప్రేమను తిరస్కరించడంతో 5 వ అంతస్థులో ఉన్నటువంటి అతను అక్కడికక్కడే ఆమె కళ్ల ముందే దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు.అయితే ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగు లోకి వాచినట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఈ వార్త నిన్ననే వచ్చినా సరే ఆ సంఘటన రికార్డు అయినటువంటి సీసీ టీవీ ఫుటేజ్ లో మాత్రం 9 వ నెల 14 తారీఖు చూపిస్తుంది.5 వ అంతస్థు నుంచి దూకినటువంటి రోషన్ మూడో అంతస్థులో పది అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.