టాలీవుడ్ యంగ్ హీరో అరుణ్ ఆదిత్, హాట్ బ్యూటీ హెబ్బాపటేల్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం 24 కిస్సెస్. నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం అనే టాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మిణుగురులు లాంటి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాలను మించి, లిప్ లాక్‌లతో తెరకెక్కిన ఈ చిత్రం పై ఇప్పటికే వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఇది బూతు సినిమా కాదని, మంచి క్లాసికల్ లవ్ స్టోరీ అని, థియేటర్ నుంచి బయిటికి రాగానే ఎమోషన్ అనే తీపి గుర్తుతో వస్తారని, ఫ్యామిలీతో అందరూ కలిసి చూడ దగ్గ సినిమా అని దర్శకడు అయోధ్య చెబుతున్నాడు. మరి ఈ నేపధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 24 కిస్సెస్ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ :
మాస్ కమ్యునికేషన్ చేస్తున్న శ్రీలక్ష్మీ (హెబ్భా పటేల్).. చిల్డ్రన్ ఫిల్మ్ మేకర్ అయిన ఆనంద్ (ఆదిత్)తో ఒక వర్క్ షాప్లోకలుస్తుంది. ఈ క్రమంలో వారి పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక వారి ప్రేమ పీక్స్‌కు వెళ్ళి, మంచి రొమాన్స్‌తో సాగుతుండగా ఒకరోజు గోవావెళతారు. అయతే అక్కడ శ్రీలక్ష్మీకి, ఆనంద్ అసులు రూపం తెలుస్తోంది. తనతో ముద్దులాట సాగిస్తున్న ఆనంద్, ఇంకా చాలామంది అమ్మాయిలతో రొమాన్స్ చేసి వారిని మోసం చేస్తున్నాడని తెలిసి ఆనంద్‌ను ఛీకొడుతుంది శ్రీలక్ష్మి. అయితే లక్ష్మీ దూరమవడంతో ఆనంద్ తన తీరును మార్చుకున్నాడా, తిరిగి లక్ష్మీని దక్కించుకున్నాడా.. అసలు ఈ కథకి 24 కిస్సెస్ అని టైటిల్ ఎందుకు పెట్టారు.. అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.
విశ్లేషణ :
24 కిస్సెస్ ఫీల్ గుడ్ లవ్ స్తోరీ అని, కుటుంబంతో కలిసి అందరూ చూడదగ్గ చిత్రమని, అయితే 24 కిస్సెస్ అని టైటిల్ పెట్టడానికి అందులో కీ పాయింట్ ఉందని చెప్పారు దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. అయితే అందరూ ఊహించిన విధంగా ఆ చిత్రంలో ముద్దులు తప్ప కంటెట్ లేదని తేల్చేశారు ప్రేక్షకులు. ఒక సెన్షేషన్ టైటిల్‌తో మనముందుకు వచ్చిన దర్శకుడు.. తాను అనుకున్న మెయిన్ పాయింట్‌ను ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడు. తీసుకున్న కథలో విషయం లేకపోగా, వరెస్ట్ స్క్రీన్‌ప్లేతో ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకు నరకం చూపించాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ తప్పా ఈ చిత్రంలో అసలేమాత్రం మ్యాటర్ ఉండదు. హీరో క్యారెక్టర్ మొదటి నుండి కన్ఫ్యూజింగ్గానే సాగుతుంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కూడా మెప్పించవు.
ప్లస్ పాయింట్స్ :
రొమాంటిక్ సీన్స్
హెబ్భా పటేల్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
స్టోరీ
స్క్రీన్ ప్లే
స్లో నరేషన్
తీర్పు :
టాలీవుడ్లో ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో, మిణుగురులు లాంటి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయోధ్యకుమార్.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఈసారి 24 కిస్సెస్.. అంటూ రచ్చ టైటిల్ పెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రంలో టీజర్, ట్రైలర్లో చూపించిన విధంగా ముద్దులు తప్పా, కథ,కథనంలో విషయం లేదని, ఫీల్ బ్యాడ్ మూవీ అని ఈ మూవీలో హెబ్బా పటెల్ కిస్‌లు వర్కౌట్ కాలేదని ప్రేక్షకులు తేల్చేశారు.
Rating : 1/5