వీణామాలిక్ కు 26ఏళ్ళు జైలుశిక్ష!

Wednesday, November 26th, 2014, 10:46:41 AM IST

Veena-malik
పాకిస్థాన్ లో ఇస్లాం మతాన్ని కించపరుస్తూ దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించిన జీయో టీవీ అధిపతి షకీల్- ఉర్ -రెహ్మాన్ కు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటి వీణా మాలిక్, ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయిష్ట వాహిదీలకు 26ఏళ్ళ జైలు శిక్షను విధిస్తూ అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. అలాగే జైలుశిక్షతో పాటు 13లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది.

ఇక వివరాలలోకి వెళితే ఇటీవల వివాహం చేసుకున్న వీణా మాలిక్, ఆమె భర్త దుబాయ్ పారిశ్రామికవేత్త అసద్ బషీర్ లు జియో టీవీ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి అతిధులుగా వెళ్లి ముస్లిం మతాచారాలకు భంగం కలిగించేలా ఉన్న ఒక పాటకు డాన్సు చేశారు. దీనితో ఈ షో ద్వారా దైవాన్ని అవమానించారని పలువురు చేసిన పిర్యాదుల మేరకు వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఇక దేనిపై విచారణ జరిపిన కోర్టు కార్యక్రమం నిర్వాహకులకు, మరియు పాల్గొన్న వీణా దంపతులకు కూడా 26ఏళ్ళ జైలు శిక్ష మరియు 13లక్షల జరిమానాను విధించింది.