ఆ నలుగురు…అమెజాన్ తో ఆడుకున్నారు

Friday, April 13th, 2018, 03:30:25 PM IST

సైబర్ నేరగాల్లు ఏకంగా దిగ్గజ కంపనీలనే టార్గెట్ చేస్కొని మరీ మోసాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ ఓ వైపు అభివృద్ధి వైపు దూసుకేళ్తుంటే మరోవైపు సమాజం వినాశాకానికి దారితీస్తుంది. తాజాగా అమెజాన్ సంస్థను మోసం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫోన్లు తీసుకుని తమకు రాలేదంటు నిందితులు పేర్కొంటూ, ఏకంగా అమెజాన్ సైట్ నే హ్యాక్ చేసి.. మళ్లీ ఫోన్లు పంపించాలని అమెజాన్‌కు ఆర్డర్లు చేశారు. విషయంపై అనుమానం వచ్చి అమెజాన్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌క్రైమ్ డీసీపీ జానకీ షర్మిలా ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి చివరికి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 10.75 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 556 సిమ్‌కార్డులు, 42 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.