అనుమతి లేకుండా దేశంలోకి చొరబడుతున్న వారి సంఖ్య ఇటీవల చాలా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ మధ్య ఎక్కువగా అలాంటి కేసులు నమోదయ్యాయి. రీసెంట్ గా ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన వారిలో 52 మంది భారతీయులే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ శనివారం చట్ట సభ్యులు నిర్బంధ కేంద్ర సందర్శనానికి వెళ్లి ఈ విషయాన్ని తెలిపారు. ఒరెగాన్ రాష్ట్రంలో ఆశ్రయం పొందడానికి ప్రయత్నం చేస్తుండగా వారిని పట్టుకున్నారు.
ఇక అందులో సిక్కులు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా 123 మందిని బందీలు చేశారు. చైనా, మెక్సికో, నేపాల్, పాకిస్థాన్, ఉక్రెయిన్ ప్రాంతాల వారు కూడా అక్రమంగా చొరబడుతున్నట్లు తెలుస్తోంది. 22 గంటల పాటు ఒకరోజులో వారిని చిన్న గదిలో ఉంచుతున్నారట. చాలా ఇబ్బందిగా ఉందని బందీలు చెప్పినట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు అక్రమంగా వచ్చిన పిల్లల సంఖ్య 12 వేలకు కు చేరింది. అందులో రెండు వేల మందికి పైగా అక్రమంగా వారి సొంత నిర్ణయాలతోనే వచ్చారట. మిగతా వారిని తల్లిదండ్రులు వదిలేసినట్లు సమాచారం. ఇక అమెరికా దేశ అధ్యక్షుడు ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్య వాదులు దేశానికి ఇబ్బందిగా మారారని అక్రమ వలసలను నియంత్రించాలని సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ గా చెప్పారు.