ఆ బ్యాగులో నరికిన చేతులు.. ఎలా వచ్చాయి?

Saturday, March 10th, 2018, 06:04:56 PM IST

రష్యాలోని సైబీరియా ప్రాంతం వాసులకు ఉదయాన్నే ఓ బ్యాగు ఎంతో భయాన్ని కలిగించింది. నిర్మానుషమైన ప్రదేశంలో బ్యాగు నుంచి ఓ చేయి బయటకు కనిపిస్తుండడంతో చుట్టూ పక్కల వారు దెయ్యాలు సంచరిస్తున్నాయని వణికిపోయారు. అంతే కాకుండా మంత్రగాళ్లూ ఎవరైనా సంచరిస్తున్నారేమో అనే రూమర్ ఒక్కసారిగా వ్యాప్తి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నది ఒడ్డున ఉన్న బ్యాగును పరిశీలించారు. అయితే ఈ సారి పోలీసులు కూడా షాక్ తిన్నారు.

ఎందుకంటే ఆ బ్యాగు నిండా చేతులే ఉన్నాయి. మణికట్టు వరకు నరికి ఉన్న చేతులను లెక్కిస్తూ బయటికి తీయగా వాటి సంఖ్య 54 దగ్గర ఆగింది. మంచు ప్రాంతం కావడంతో చేతులు కుళ్లిపోకుండా బాగానే ఉన్నాయని పోలీసులు వాటిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్నిటి వేలి ముద్రలను సేకరించారు. రష్యా పరిసర ప్రాంతాల్లో ఇఇంతకుముందు ఎన్నడు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. మరి ఈ చేతులు ఎలా వచ్చాయి ఎవరైనా శిక్షల పేరుతో నరికరా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.