రేపిస్ట్ సుబ్బయ్య చనిపోయే ముందు మాట్లాడిన కాల్ రికార్డు విన్నారా..?

Friday, May 4th, 2018, 06:40:44 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దాచేపల్లి దారుణానికి సంబంధించిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన సుబ్బయ్య అనే 51 ఏళ్ల వృద్ధుడు (వయసులో ఇంకా పెద్దవాడని చెబుతున్నారు) మాయమాటలు చెప్పి ఎనిమిదేళ్ల చిన్నారిని రేప్ చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తమయ్యేలా చేసింది. ఈ ఉదంతంతో దాచేపల్లి మొత్తం అట్టుడికిపోయింది. ఇదిలా ఉండగా.. రేప్ చేసిన అనంతరం.. తాను చేసిన ఛండాలమైన పని బయటకు పొక్కిందని తెలుసుకొని ఊరి నుంచి పారిపోయాడు. దైదలోని అమరలింగేశ్వర ఆలయ సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవటానికి కొద్ది ముందుగా ఒక బంధువుతో సుబ్బయ్య మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది. తాను చేసిన దారుణమైన పనికి తీవ్ర పశ్చాతాపానికి గురైనట్లుగా సుబ్బయ్య మాటలు ఫోన్ కాల్ లో కనిపించాయి.
ఎక్కడ ఉన్నావన్న బంధువు ప్రశ్నకు.. చావుకు దగ్గరగా ఉండాలె అన్న మాట చెప్పాడు. పది మందికి మంచి చెప్పి.. సరదాగా బతికేవాడినని.. అలాంటిది అనుకోకుండా జరిగిందని.. ఇక బతకకూడదని.. ముఖం చూపించకూడదని ఫోన్ కాల్ లో చెప్పాడు. తన ఖర్మ కాలిందని..పాపం పండిందని పేర్కొన్నాడు. తాను చేసిన పని వల్ల తన కొడుకు పరువు పోయిందని.. వాడికి జీవితమన్నదే లేకుండా చేశానని బాధ పడ్డాడు. ఎక్కడున్నావో చెప్పు.. నీకేం కాదన్న బంధువు భరోసా మాటలకు.. ఏం వద్దయ్యా అంటూ సమాధానం చెప్పిన సుబ్బయ్య.. తన కారణంగా తన కొడుకు ఇప్పుడు ఎలా బతుకుతాడో అర్థం కావటం లేదన్నాడు. ఎంతో ముద్దుగా.. తన కొడుకును పెంచానని.. పెద్దవాడ్ని చేశానని.. చివరకు అతడి బతుకును అన్యాయం చేసి వెళుతున్నానని చెప్పాడు. పరువు లేకుండా చేసానన్న సుబ్బయ్య మాటలకు అడ్డుగా.. ఎక్కడ ఉన్నావో చెప్పాలన్న ప్రశ్నకు.. అహంకారంతో తానీ పాపపు పని చేసినట్లుగా వ్యాఖ్యానించాడు. పొద్దున్నే చూస్తే నీకు అందుబాటులో శవమై కనిపిస్తాలే అంటూ ఫోన్ కాల్ ముగించిన సుబ్బయ్య.. చెప్పినట్లే చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు.