కొంప ముంచిన మిస్డ్ కాల్స్ – 1.86 కోట్లు మాయం..!

Thursday, January 3rd, 2019, 04:52:58 PM IST

టెక్నాలజీ పెరుతున్నకొద్దీ, ఎంత సౌకర్యవంతంగా ఉంటోందో, కొన్ని కొన్ని సార్లు అంతే ప్రమాదకరంగా మారుతోంది. ఒక పక్క జీవన ప్రమాణాలు పెంచుతున్న టెక్నాలజీయే మరో పక్క చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. మన ప్రమేయం లేకుండానే మన జీవితాలలోకి చొరబడిన టెక్నాలజీ కొంత మంది పట్ల శాపంగా మారుతోంది, ముంబైలో సైబర్ నేరగాళ్లు ఒక బిసినెస్ మ్యాగ్నెట్ ను టార్గెట్ చేసి అతనై ఖాతాలోనుడి 1.86 కోట్ల రూపాయల డబ్బును దొంగలించారు. వివరాల్లోకి వెళితే సదరు వ్యాపారికి ఓ రోజు రాత్రి 2గంటల సమయంలో 6 మిస్డ్ కాల్స్ వచ్చాయి, అతను మిస్డ్ కాల్స్ కదా అవసరం ఉన్నవాడు చేస్తాడులే అని లైట్ తీసుకున్నాడు, అంతే తెల్లవారి చూసేసరికి ఆయన ఖాతాల్లో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి. అంతే కాకుండా ఆయన సిమ్ కార్డుకు సిగ్నల్స్ కూడా కట్ అయ్యాయి, +44 నంబర్ నుండి ఫోన్ రావటంతో యూకే నంది వచ్చిందని భావించి, ఆ నంబర్ కు కాల్ చేయగా మిస్డ్ వచ్చిన నంబర్ కూడా పనిచేయలేదు. దీంతో టెలిఫోన్ ఒపెరాటేర్ కు ఫోన్ చేసి అడుగగా మీ నంబర్ నుండి సిమ్ డి – యాక్టివేషన్ కు రిక్వెస్ట్ వచ్చిందని చెప్పటంతో ఖంగు తిన్న ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుడు తెలిపిన వివరాలను పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు సిమ్ స్వాపింగ్ టెక్నాలజీ ద్వారా అతని సిమ్ కార్డును బ్లాక్ చేసి ఉంటారన్న అంచనాకు వచ్చారు. అందుకోసమే తన సిమ్ డియాక్టివ్ అయ్యిందా లేదా తెలుసుకోవటం కోసమే మిస్డ్ కాల్స్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆ రకంగా అతని అకౌంట్లు హ్యాక్ చేసి ఖాతాలో డబ్బుల్ని మాయం చేసారని అంటున్నారు. బ్యాంకు వారిని సంప్రదించగా ఆ మొత్తం డబ్బు 12ఖాతాలకు ట్రన్స్ఫర్ అయినట్టు తెలిపారు. ఇప్పటివరకు 20లక్షల వరకు రికవరీ చేసిన బ్యాంకు అధికారులు మిగతా సొమ్మును కూడా రికవరీ చేసే పనిలో పడ్డారు.