పట్టుబడ్డ దొంగల ముఠా…

Thursday, November 1st, 2018, 07:06:27 PM IST

వరుస చోరీలతో రాజేంద్రనగర్ పోలీస్ ఠాణా పరిధి అట్టడుకుపోయింది. చోరీ జరిగిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న వాహనం లో దొంగల ముఠా తో పాటు 30 లక్షల విలువైన 753 గ్రా. బంగారం, 550గ్రా. వెండి ఆభరణాలు, 3 ఎల్ఈడీ టీవీలు, వీటిని విక్రయించడానికి సహకరిస్తున్న మరొక వ్యక్తిని సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ క్రైమ్స్ డీసిపీ జానకి షర్మిళ, శంషాబాద్ డీసిపీ ప్రకాష్ రెడ్డి లతో కలిసి పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా కి తెలిపారు. ఈ ముఠా కి మహమూద్ అయూబ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇతను తన 10వ ఏటా తన మకాం ని హైదరాబాద్ కి మార్చాడు. అయూబ్ మొదట తన నాన్నకి పండ్ల వ్యాపారం లో సహకారంగా ఉండేవాడు, ఆ తరువాత ఆటో నడుపుతూ శివారులలోని పశువులను చోరీ చేసిన క్రమంలోనే 2008 లో చందా నగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. జైలుకు వెళ్ళొచ్చినప్పటికీ కూడా అయూబ్ ఏమి మారకపోవడం తో పాటు పలు ప్రాంతాల్లో లారీలు, ఇతర వాహనాలు చోరీ చేసి మల్లి జైలుకి వెళ్లి గత ఆగష్టు లో బయటికి వచ్చాడు. అయితే మెహదీపట్నం కి చెందిన గుంజపోగు సుధాకర్ 5వ తరగతి వరకు చదివి చిన్నతనం లోనే చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు చేస్తూ జైలుకి వెళ్లిన క్రమంలో అక్కడ యాదగిరి తో పరిచయం ఏర్పడింది. ఇరువురు కలిసి రాత్రిళ్ళు ఇళ్లలో చోరీలు చేయడం మొదలుపెట్టారు. ఇలా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లలో 62కి పైగా కేసులకి పట్టుబడ్డ సుధాకర్ పై 2015లో పీడీయాక్ట్ కింద ఆసిఫ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినప్పటికిని మల్లి చోరీ కేసులో మీర్ పెట్ పోలీసులకి చిక్కాడు. గతం లో పరిచయమైనా సుధాకర్ తో కలిసి అయూబ్ చోరీలు చేయడానికి పథకాన్ని రచించాడు. అప్పుడు తనకి పరిచయం ఉన్న నవీన్ , మహేందర్ లతో కలిసి గత ఆగష్టు నుండి రాత్రి వేళల్లో ఇళ్లల్లో చోరీలు చేయడం మొదలు పెట్టారు.

ఆ క్రమం లోనే పాత బస్తిలో క్వాలిస్ అద్దెకు తీసుకోని వారు ఎంచుకున్న ప్రాంతాల్లో రెక్కీ ని నిర్వహించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గ చేసుకుని అయూబ్ వాహనాన్ని కొద్దీ దూరం లో ఆపేస్తాడు. అయూబ్ వాహనం లో ఉండగానే మిగతా ముగ్గురు సుధాకర్, నవీన్, మహేందర్ లు ఇళ్లలో చోరీలకు వెళ్లేవారు. తాళాలు పగలగొట్టడంలో దిట్ట అయినా సుధాకర్ తన పని తాను చేయగా మిగిలినా ఇద్దరు ఇళ్లలోని నగదు, నగలు ఎత్తుకెళ్ళేవారు. ఇలా రాచకొండ ప్రాంతంలో ఈ గ్యాంగ్ 9 దొంగతనాలు చేసింది. అయితే వరుస చోరీలతో అప్రమత్తమైన డీసీపీ జానకి శర్మిల ఆధ్వర్యంలో శంషాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లతో కలిసి నిఘా పెట్టారు. వారికీ క్వాలిస్ కదలికలపై అనుమానం రావడం తో వాహన యజమాని తో మాట్లాడగా అయూబ్ వాహనాన్ని తీసుకెళ్లాడని చెప్పాడు. ఆలా ఈ ముఠా పోలీసులకి పట్టుబడింది. అయూబ్, సుధాకర్, మహేందర్ లతో పాటు నగలు విక్రయించి నగదు గ మార్చే వ్యక్తి మహమూద్ బాబాని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం నవీన్ కుమార్ పరారీ లో ఉన్నాడు. ఈ ముఠా ని పట్టుకున్న పోలీస్ బృందానికి పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు.