క్యాన్సర్ పేషంట్ ను పరామర్శించిన రెహమాన్

Thursday, January 8th, 2015, 06:17:04 PM IST


ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ తన 48వ జన్మదినం సందర్భంగా మంగళవారం చెన్నైలో తన అభిమాని అయిన క్యాన్సర్ పేషంట్ ను పరామర్శించారు. కాగా ప్రస్తుతం ప్రముఖ సెలబ్రిటీలైన సినీ,రాజకీయ ప్రముఖులు రోగులైన తమ అభిమానులను కలిసి పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంగా తెలుగునాట ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమాని అయిన చిన్నారి శ్రీజను ఖమ్మంలో పరామర్శించగా, రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి చిరంజీవి తన అభిమాని బాలును పరామర్శించి తన సినిమాలో అవకాశం కూడా ఇస్తానని మాట ఇచ్చారు. ఇక తమిళ హీరో విజయ్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలా అందరూ తమ అభిమానులను పరామర్శించి వారికి ధైర్యం చెబుతున్నారు.

ఇక అదే బాటలో రెహమాన్ కూడా తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన అభిమాని అయిన క్యాన్సర్ పేషంట్ తో కాసేపు గడిపారు. అనంతరం కుటుంబంతో కాసేపు గడిపి, తన పేస్ అభిమానులతో చాట్ చేసి జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారని రెహమాన్ స్నేహితులు తెలిపారు.