ఓటర్ తో ఆధార్ కార్డ్ లింక్

Friday, November 7th, 2014, 10:16:40 PM IST


ఓటర్ కార్డుతో ఆధార్ ను లింక్ చేసేందుకు ఏపి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఓట్లను ఏరివేతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. నవంబరు నెలాఖరు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని.. 2015జనవరి నాటికి ఆధార్ అనుసంధానం పూర్తీ అవుతుందని.. ఆయన తెలిపారు. ఆధార్ నెంబరు తప్పకుండా ఇవ్వాలని.. అది ఇవ్వని వారి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని భన్వర్ లాల్ స్పష్టం చేశారు.