ప్రముఖ నటుడు పీజె శర్మ కన్నుమూత

Sunday, December 14th, 2014, 12:55:56 PM IST


ప్రముఖ నటుడు పీజె శర్మ గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. నిన్న తన మనమడు ఆది వివాహ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగ.. ఈ రోజు గుండెపోటుతో హఠాత్తుగా మరణించడంతో పెళ్లిఇంట విషాదంనెలకొన్నది. నడుడిగా… డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పీజె శర్మ తెలుగుప్రజలకు సుపరిచితులు. పీజె శర్మ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో.. మా అసోసియేషన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఎర్రగడ్డ స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.