రింగులు మార్చుకున్న త్రిష-వరుణ్

Saturday, January 24th, 2015, 01:16:22 AM IST


సినీనటి త్రిష నిశ్చితార్థం ప్రముఖ నిర్మాత, బిజినెస్ మ్యాన్ వరుణ్‌ మణియన్‌తో చెన్నైలో ఘనంగా జరిగింది. వరుణ్ నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో త్రిష, వరుణ్ కుటుంబసభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. నిశ్చితార్థ వేడుకలో త్రిష ప్రముఖ డిజైనర్ నీతాలుల్లా ప్రత్యేకంగా డిజైన్ చేసిన శారీని ధరించారు. వరుణ్ సాంప్రదాయ తెలుపు ధోతి ని ధరించారు.

వరుణ్ నివాసంలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో సినీ నటులు కమల్‌హాసన్, విక్రమ్ ప్రభు, గౌతమి, రమ్య క్రిష్ణన్, సుహాసిని,అమలాపాల్, దర్శకుడు మణిరత్నంతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. త్రిష-వరుణ్‌లు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో వీరు ఏడడుగులు నడవబోతున్నారు.