రివ్యూ రాజా తీన్‌మార్ : అజ్ఞాతవాసి – ఈ రిజల్ట్ ఊహాతీతం

Wednesday, January 10th, 2018, 06:05:31 PM IST

తెరపై కనిపించిన వారు : పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్

కెప్టెన్ ఆఫ్ ‘ అజ్ఞాతవాసి’ : త్రివిక్రమ్ శ్రీనివాస్

మూల కథ :
ఏబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అయిన వ్రిందా (బోమన్ ఇరానీ), అతని కొడుకును చైర్మన్ పదవి కోసం కొందరు హత్య చేస్తారు. దాంతో వ్రిందా భార్య ఇంద్రాణి (ఖుష్బు) అజ్ఞాతంలో ఉన్న తమ పెద్ద కుమారుడు అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను కంపెనీని కాపాడమని, తండ్రిని చంపిన వాళ్ళను కనిపెట్టమని వెనక్కి పిలుస్తుంది.

అలా తండ్రి, తమ్ముడి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు బయటికొచ్చిన అభిషిక్త్ భార్గవ్ నేరస్తుల్ని ఎలా కనిపెడతాడు, వారి మీద పగ ఎలా తీర్చుకుంటాడు, అసలు అభిషిక్త్ భార్గవ్ అజ్ఞాతంలో ఎందుకు ఉండవలసి వస్తుంది అనేదే తెరవని నడిచే చిత్రం.

విజిల్ పోడు :
–> పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నంతసేపు సినిమాపై ఏదో తెలీని ఆసక్తి కలుగుతూ ఉంటుంది. పవన్ కూడా చాలా చోట్ల తన చరీష్మాతో సినిమాను కాపాడటానికి ట్రై చేశారు. కాబట్టి ఆయనకు మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> మురళీ శర్మ, రావు రమేష్ ఇద్దరి పాత్రలపై నడిచే కామెడీ కొద్దిగా నవ్విస్తుంది. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర డైలాగ్స్ బాగున్నాయి.

–> ఇంటర్వెల్ ఎపిసోడ్, పవన్, కుష్బుల మధ్య ఫ్రేమ్ చేసిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> సినిమాలో పూర్తిగా త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ మ్యాజిక్ లోపించింది. దీంతో అసలిది త్రివిక్రమ్ సినిమాయేనా అనిపించింది. ఇది పూర్తిగా ఆయన వైఫల్యమే.

–> కథ ఎలాగూ చిన్నదే పైగా స్ఫూర్తి పొంది తీసుకున్నదే అయినా కనీసం కథానమైన ఉత్సాహంగా, పవన్ క్రేజ్ కు తగిన విధంగా ఉండాల్సింది. కానీ కొత్తదనం, లాజిక్స్ లేకుండా బోరింగా ఉంది.

–> ఇక విలన్ ను వెతికి పెట్టుకునే ప్రయత్నాల్లో హీరో పాత్ర కొంతసేపు మాత్రమే సీరియస్ గా ఉండి చాలాసార్లు అనవసరమైన కామెడీ వైపుకు మళ్లడంతో సినిమాలో తీవ్రత లోపించింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> ఈ సినిమాలో ఒక్క త్రివిక్రమ్ విషయంలో మినహా ఆశ్చర్యపోవాల్సిన అంశాలేవీ ఉండవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> శర్మ : ఏంటి శర్మ త్రివిక్రమ్ కూడా ఇలాంటి సినిమా ఇస్తే ఎలా ?
–> వర్మ: అదే.. అదే.. నాకు అర్థం కావడంలేదు.
–> శర్మ: అంటే ఎలా తీసినా సినిమా చూసేస్తారని అనుకున్నారా ఏంటి ?
–> వర్మ: థట్స్ ద ఫైల్యూర్.
–> శర్మ : ఈ రిజల్ట్ ఊహాతీతం వర్మ