దేవుడా.. వీళ్ళకి అమ్మంటే వినయమా.. భయమా..?

Friday, May 20th, 2016, 11:17:57 AM IST


దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని ఓ ప్రత్యేకత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఉంది. తమిళ ప్రజలే కాదు తమిళ నేతలు, పెద్ద పెద్ద అధికారులు సైతం ఆమెను దేవతగా భావిస్తూ వంగి వంగి ఆమె కాళ్ళకు దండాలు పెడుతుంటారు. తాజాగా ఎన్నికల్లో ఘన విజయం సాదించిన ఆమె నిన్న ప్రజలకు, నేతలకు దర్శమిచ్చారు. అమ్మ ఠీవీగా కుర్చీలో కూర్చుంటే అందరూ ఆమె కాళ్ళకు మొక్కుతూ వినయంగా వెళ్ళిపోయారు.

ఈ సీన్ చూస్తే ఇది వినయమా.. భయమా అన్న అనుమానం రాకపోదు. ఎందుకంటే అమ్మ మామూలుగానే పెద్ద గర్వి. పైగా ఇప్పుడు మళ్ళీ అధికారం చేపట్టింది. అధికారంలోకి రాగానే అమ్మ చేసే మొదటి పని తన విధేయులను సంతోషపెట్టడం, అంతకన్నా ముందు తన వ్యతిరేకులను ఇబ్బంది పెట్టడం. కాబట్టి అమ్మ దగ్గర ఎంత వంగి ఉంటే అంత మంచిదని, ఒకవేళ ఏదైనా పోరాపాటు జరిగితే ఆమె ఆగ్రహానికి గురికాక తప్పదని తమిళ తంబీలు భయంతో కూడిన వినయాన్ని ప్రదర్శిస్తున్నారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి :