తమిళనాట రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి జయలలితకు ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఒక సాధారణమైన నటిగా ప్రస్తానం ప్రారంభించిన జయలలిత ఎమ్జీఆర్ మరణానంతరం ఆయన స్థాన్నాన్ని తీసుకుని అన్నా డిఎంకే పార్టీ తరపున నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయింది. సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆమె ప్రవేశపెట్టిన అనేక ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఆమెను ప్రజల్లో దేవతను చేశాయి. తమిళ ప్రజలు సైతం అనేక సందర్బాల్లో ఆమె మీదున్న ప్రేమను రకరకాలుగా తెలుపుతుంటారు. అలా ఓ మహిళా తన చెవికి ధరించే బంగారు చెవి పోగుల్లో జయలలిత చిత్రాన్ని స్పష్టంగా కనబడేట్టు పొందుపరుచుకుని తన అభిమానాన్ని చాటుకుంది. ఆ చిత్రాన్ని చూసిన వారంతా ఔరా ఇదేమి అభిమానం. ఈమె సూపర్ ఫ్యాన్ అవార్డు ఇవ్వాల్సిందే. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని మీరు చూడండి.
ఫోటో మూమెంట్ : తమిళనాట అమ్మంటే జనాలకు మరీ ఇంత పిచ్చా..!
Wednesday, May 11th, 2016, 11:45:55 AM IST