విమానంలో ముష్టియుద్ధం

Saturday, January 17th, 2015, 01:12:51 PM IST


ఎయిర్ ఇండియా విమానంలో ఓ ఘోరం జరిగింది. పైలట్ ఎయిర్ ఇండియా విమానం ఇంజనీర్‌పై దాడి అనూహ్యంగా దాడి చేశాడు. ఫైలట్ దాడి చేయడంతో ఇంజనీర్ కు గాయాలయ్యాయి. కాక్ పిట్‌లో జరిగిన ఈ సంఘటన అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక ఫైలట్ దాడి చేసిన తర్వాత పైలట్ తనను తాను కాక్‌పిట్‌లో నిర్బంధించుకున్నాడు. ఈ సంఘటన ఈ రోజు ఉదయం చెన్నై ప్యారిస్ ఎఐ 143 విమానంలో చోటు చేసుకుంది. దాడిలో గాయపడిన ఇంజనీర్ కన్నన్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది. దాంతో విమానం బయలుదేరడంలో రెండు గంటల ఆలస్యం అయింది. ఈ సంఘటనతో విస్తుతపోయిన ప్రయాణికులు తేరుకొని గొడవకు దిగటంతో ఎట్టకేలకు విమానం బయలుదేరింది. ఈ సంఘటన అనంతరం ఫైలట్ మరియు ఇంజినీర్ ను వైద్య పరిక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగ, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.