4జీ సేవలు వచ్చేశాయోచ్..!

Sunday, May 17th, 2015, 03:10:41 AM IST

airtel-4g
టెలికాం వ్యవస్థలో అగ్రగామి సంస్థ ఎయిర్ టెల్ నేడు ముంబైలో ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు సంస్థ ముంబై, మహారాష్ట్ర సర్కిల్ సీఈఓ అశోక్ గజపతి మాట్లాడుతూ ఇప్పటికే సంస్థ నుండి 3జీ సేవలు పొందుతున్నవారికి అదే ధరలకు 4జీ సేవలు అందిస్తామని, కొత్త కస్టమర్ల కోసం బండిల్డ్ ఆఫర్లను సిద్ధం చేశామని వివరించారు. అలాగే మొదట 4జీ సేవల నాణ్యతపై కస్టమర్ల నుండి అభిప్రాయాలు స్వీకరిస్తామని, తరువాత వీటిని పూర్తి స్థాయిలో విస్తరిస్తామని అశోక్ తెలిపారు. ఇక సామ్ సంగ్, మోటరోల, జియోమి, లెనెవో, అసూస్, హ్యూయ్ తదితర సంస్థలతో డీల్ కుదుర్చుకుని, 4జీ టెక్నాలజీకి సహకరించే ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించేందుకు ఎయిర్ టెల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.