అఖిల్ రెండో చిత్రం ముచ్చట్లు .. ఇప్పటికీ సస్పెన్సే.?

Friday, February 26th, 2016, 10:17:37 AM IST


అఖిల్ మొదటి సినిమా.. అఖిల్.. బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. మొదటి సినిమాలో చేసిన తప్పులను రెండో చిత్రంలో చేయకుడదని అఖిల్ భావిస్తున్నాడు. రెండో సినిమాను సక్సెస్ చేయాలని అఖిల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, అఖిల్ రెండో సినిమా ఎవరి బ్యానర్ లో ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు అంతా చర్చ జరుగుతున్నది. మొదటి సినిమా నితిన్ ప్రొడక్షన్లో వచ్చింది. అయితే, రెండో చిత్రాన్ని హొమ్ బ్యానర్ లో చేయాలని అనుకుంటున్నా.. శ్రీమంతుడు వంటి హిట్ సినిమాను నిర్మించి, ఇప్పుడు ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేస్తున్న మైత్రి మూవీస్ సంస్థ నుంచి అఖిల్ కు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తున్నది.

అఖిల్ రెండో సినిమాను తాము నిర్మిస్తామని ముందుకు వచ్చారట. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ అఖిల్ తన రెండో సినిమా హొమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తే.. మైత్రి మూవీస్ సంస్థ అఖిల్ మూడో సినిమా బాధ్యతలను తీసుకుంటుంది. లేదు అంటే అఖిల్ రెండో సినిమానే నిర్మించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.