తన గర్ల్ ఫ్రెండ్ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్న ‘అఖిల్’..!

Monday, June 27th, 2016, 01:38:26 PM IST


అక్కినేని నట వారసుడిగా ఈమధ్యే ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు ‘అక్కినేని అఖిల్’. టాలీవుడ్ లోనే గాక సిటీలో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో అఖిల్ కూడా ఉన్నాడు. అంతటి లేడీ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.

అందుకు కారణం అఖిల్ తీసుకుంటున్న జాగ్రత్తే. తన గర్ల్ ఫ్రెండ్ ను పబ్లిక్ ముఖ్యంగా మీడియా కంటపడకుండా చూస్తూ హాయిగా డీసెంట్ లవ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అఖిల్. ఈ విషయాన్ని ఒకసారి అఖిల్ స్వయంగా మీడియాకు చెప్పాడు. ఆ అమ్మాయి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, చాలా కాలంగా పరిచయమని, కావాలనే మీడియాకు ఆమె వివరాలు తెలియకుండా జాగ్రత్తపడుతున్నానని చెప్పాడు. అలాగే తన తల్లిదండ్రులు తనకు సపోర్ట్ గా ఉన్నారని కూడా తెలిపాడు. సో అఖిల్ మాటలు వింటుంటే త్వరలోనే పెళ్లి కబురు కూడా మెల్లగా చెప్పేలా ఉన్నాడు.