అక్కడంతా రాజకీయ జైలు పక్షులే.!

Tuesday, September 30th, 2014, 02:02:48 PM IST


తమిళనాడు రాజకీయ నేతలకు జైలుతో విడదీయని బంధంగా మారిపోయింది. జైలు జీవితమంటే తమిళ నాయకులకు ఓ టూర్ లా కనిపిస్తోంది. తమిళనాట చిన్నాచితకా నేతలు మొదలు.. పెద్దపెద్ద నేతలవరకూ దాదాపు అందరు జైలుకెళ్లివచ్చినవారే. వెళ్లబోతున్నావారే.

ఐదేళ్లకో మారు సర్కారును మార్చే రాజకీయ సంప్రదాయమున్న తమిళనాడులో ప్రతిపక్ష పార్టీకి.. ఐదేళ్ల నరకం తర్వాత అధికారం ప్రాప్తించడం ఖాయం. ఇందులో భాగమే.. డీఎంకే చీఫ్- కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు.. అన్నాడీఎంకే చీఫ్- జయలలితకు కష్టాల సుడిగుండాలు.. ఆ తరువాత కోర్టు కేసులు, ఇక అప్పుడప్పుడూ జీవితం కూడానూ. డీఎంకే అధికారం కోల్పోయినప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. అప్పుడు.. కరుణానిధి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులంతా పోలీస్- స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరక్కతప్పదు.

పలు కేసుల్లో చిక్కుకున్న కరుణానిధికి జైలు, కోర్టు ఏ మాత్రం కొత్త కాదు. ఇక టూజీ కేసులో కరుణానిధి కూతురు కనిమొళి, కరుణానిధి మనువడు-మాజీ కేంద్ర టెలికం శాఖామంత్రి..దయానిధి మారన్, డీఎంకే పార్టీ ఎంపీ రాజా.. అందరూ తీహార్- జైలు జీవితం చూసినవారే. ఇప్పటికీ అవినీతి, ఆదాయానికి మించిన ఆస్థుల కేసుల్లో సీబీఐ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇక ఎండీఎంకే పార్టీ చీఫ్ -అయిన.. వై గోపాలస్వామి..అంటే వైగోకు జైలు జీవితం అనుభవమే. ఆదాయానికి మించిన eల కేసులో.. జైలుకెళ్లిన జయలలిత కూడా.. గతంలో జైలు జీవితం గడిపినవారే. మొత్తానికి జైలు అంటే తమిళనేతలకు అవసరమయ్యే టూర్ లా మారుతోందన్న మాట.