అమర్ అక్బర్ అంటోని విజయ ఒకవైపు రవితేజకి.. మరోవైపు శ్రీను వైట్లకి చాలా ముఖ్యం. రెండు వరుస ప్లాప్‌లు తర్వాత ఎలాగైనా ఫామ్‌లోకి రావాలని రవితేజ కసితో ఉన్నాడు. ఇక మరోవైపు శ్రీను వైట్లకి అయితే లైఫ్అండ్ డెత్ ఈ సినిమా. మరి ఈ ఇద్దరు నిలదొక్కుకోవాలంటే.. అమర్ అక్బర్ ఆంటోని విజయం తప్పనిసరి. మరి ఈనేపధ్యంలో ఈ హిట్ కాంబినేషన్లో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిని అమర్ అక్బర్ ఆంటోని చిత్రం హిట్టా లేక ఫట్టా అనేది తెలుసుకుందా.
ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తారు.. ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రా అనే ఇద్దరు స్నేహితులు. వ్యాపారంలో లాభాలు రావడంతో ఈ ఇద్దరు స్నేహితులు తమ కంపెనీలోనే పని చేస్తున్న నలుగురు మిత్రులకు పార్టనర్ షిప్ ఇస్తారు. అయితే ఈ నలుగురు కంపెనీలో పార్టనర్ షిప్ పొందడమే కాకుండా మొత్తం ఆస్థి పై కన్నేస్తారు. దీంతో పక్కా స్కెచ్ వేసి ఇద్దరు మిత్రుల్ని వారి కుంటుంబ సభ్యుల్ని చంపేస్తారు. అయితే ఆనంద్, సంజయ్‌ల పిల్లలు అమర్(రవితేజ), ఐశ్వర్య (ఇలియానా) ఈ ఇద్దరు వేరువేరుగా తప్పించుకని పెరిగి పెద్దవుతారు. మరి ఈ ఇద్దరు మళ్ళీ ఎలా కలిసారు.. తమ తల్లి,దండ్రులను చంపిన వారి పై ఎలా పగ తీర్చుకున్నారు ఇదే అమర్ అక్బర్ అంటోని కథ.
అమర్ అక్బర్ ఆంటోని రివేంజ్ డ్రామాతో ఈ సినిమా ఫస్టాఫ్‌ని స్టార్ట్ చేసిన శ్రీను వైట్ల దానికి తగ్గ సీన్లు క్రియేట్ చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఎమోషన్ పండాల్సిన చోట అనవసరంగా కామెడీని చేర్చి గందరగోళం సృష్టించాడు. ఈ కథ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే సైడ్ ట్రాక్ ఎక్కడంతో, మూడు వేరియేషన్ క్యారెక్టర్లలో నటించిన రవితేజ కూడా.. కాపాడలేకపోయాడు. ఓ రివేంజ్ స్టోరీకి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్.. డిసోసియేటివ్ ఐడెంటిటీ వ్యాధిని హీరోకి ఎక్కించి మూడు పాత్రల్లో చూపించి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. కథ సీరియస్‌గా నడుస్తున్న టైమ్‌లో ఈ మూడు క్యారెక్టర్లు కన్ఫ్యూజ్ చేస్తాయి. దీంతో అసలు ఎవరు అమర్ ఎవరు.. అక్బర్ ఎవరు.. ఆంటోని ఎవరనేది తెలియక ప్రేక్షకులు ఒకరికి ముఖం ఒకరు చూసుకున్నారు.
ఇక ఇలియానా దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ కథలో ఆమె పాత్ర పెద్దగా ఏమి లేదు. కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. గ్లామర్ పరంగా కూడా పెద్దగా మార్కులు వేసుకోలేకపోయింది. ఇక ఈ చిత్రంలో చాలా మంది స్టార్ కమెడియన్లు ఉన్నా.. ప్రేక్షకులకు వినోదం పంచలేకపోయారు. వరుసగా మూడు డిజాస్టర్ల తర్వాత కూడా వచ్చిన మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు శ్రీను వైట్లకు. మిస్టర్ ప్లాప్ తర్వాత ఆల్మోస్ట్ వైట్ల పని అయిపోయిందని భావించగా.. రవితేజ మాత్రం నమ్మకం,తో శ్రీనుతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఇక ఈ ఇద్దరికి మైత్రీ మూవీ మేకర్స్ తోడవడంతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అయితే శ్రీనువైట్ల మాత్రం ఎలాంటి మార్పు రాకపోగా.. మరో రొటీన్ చిత్రంతో వచ్చి ప్రేక్షకులకు అసహనం, అయోమయం, ఆందోళన కల్గించాడు.
ఆకట్టుకోని రివేంజ్ డ్రామా
అమర్ అక్బర్ ఆంటోనీ.. అయోమయం
రోటీన్ అండ్ బోరింగ్ ఎంటర్టైనర్
What did you think of ‘Amar Akbar Anthony’ (‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి)?
Just watched the movie. Horrrible.
Seenu Vaitla neeko dhandam. Babu Raviteja nv velli netflix lo comedy chesko. Chasthunamu nee routine action choodaleka. Chiraagga vndhi.
Diaster utterflop are not enough to descripe. Cheap comedy.. My review 0/5— @fifth beast (@Ratnavel6) November 16, 2018
Mass Maharaj ❤️ Srinu Vaitla 💣 Combo never fails 🤘 — watching Amar Akbar Anthony at PGR Cinemas https://t.co/ArrQlHf0EK
— VamsiKrishna Ykuntam (@VkYkuntam) November 16, 2018
Asalu ento e madya directors comedy scenes entha try chesina audience ki navvu ravatle , infact irritating untadhi comedy scenes
Arjun Reddy lanti humour expecting
Brahmi , okkadni kotti kindle cheyadam and punch dialogues comedy old aypoindi#AmarAkbarAnthony— 😔💔😭 (@we__key) November 16, 2018