టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ- టైమింగ్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా మెరవగా తమన్ సంగీతం అందించారు. ఇక వరుస ప్లాపులతో రేసులో వెనకబడిపోయిన ఈ హిట్ కాంబో ఈసారి ఎలాగైనా హిట్‌కొట్టాలనే కసితో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన అమర్ అక్బర్ అంటోనీ టీజర్, ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ :
రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ అసలు కథ విషయానికి వస్తే.. చాలా కాలం నుండి న్యూయార్క్‌లతో స్థిరపడిన.. రవితేజ (అమర్) – ఇలియాన (ఐశ్వర్య) పెరెంట్స్‌ను చంపాలని వారి సన్నిహితులు ప్లాన్ చేయడం నుంచి కథ మొదలవుతుంది. వారి ప్లాన్ ప్రకారమే అమర్- ఐశ్వర్యల ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని చంపేస్తారు. అయితే అమర్- ఐశ్వర్యలు మాత్రం తప్పించుకుంటారు. ఈ క్రమంలో అమర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనే వ్యాధితో సతమతమవుతూ ఉంటాడు.. దీంతో ఆ వ్యాధి అమర్ పై ఎలాంటి ప్రభావం చూపించింది.. అమర్ తన తల్లిదండ్రులను చంపిన వారి పై పగ తీర్చుకుంటాడా.. చిన్నతనంలో విడిపోయిన ఐశ్వర్యను కలుసుకుంటాడా అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ :
అమర్ అక్బర్ అంటోని చిత్రం దర్శకుడిగా దర్శకుడిగా శ్రీను వైట్లకు లైఫ్ అండ్ డెత్ లాంటి మూవీ.. చాలా కాలంగా ప్లాప్‌లతో సతమతమవుతున్న శ్రీనువైట్ల ఈ చిత్రంతో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇక మరోవైపు రవితేజకు కూడా ఈ చిత్ర విజయం చాలా ముఖ్యం.. రవితేజ నుండి వచ్చిన గత రెండు చిత్రాలు ప్లాప్ అవడంతో ఈ చిత్రం పై ఎన్నోఆశలు పెట్టుకున్నాడు రవితేజ.. మరి ఈ హిట్ కాంబో మ్యాజిక్ రిపీట్ చేశారా అంటే చేయలేదనే చెబుతున్నారు ప్రేక్షకులు. రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అనవసరంగా కామెడీ సన్నివేశాలు జొప్పించి ఎమోషన్ని సైడ్ ట్రాక్ చేశాడు దర్శకుడు. దీంతో ఫస్ట్‌హాఫ్ కామెడీ, కొన్ని ఇంట్రస్టింగ్ సీన్లతో యావరేజ్‌గా నిలచింది అమర్ అక్బర్ అంటోనీ.
ఇక సెకండ్హాఫ్కు వచ్చేసరికి ఆశక్తిగా మొదలైనా.. కథకు అవసరం లేని ట్రాక్‌లు సృష్టించి గందరగోళం చేశాడు.. దీంతో యాక్షన్ అండ్ ఎమోషన్స్ మధ్య కామెడీ సీన్లు సరిగ్గా డిజైన్ చేయకపోవడంతో ప్రేక్షకులు కన్ఫ్యూజన్తో తలలు పట్టుకున్నారు. ఇక రవితేజ అయితే తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టగా, ఇలియాన మాత్రం తేలిపొయింది. సునీల్ కామెడీ వావ్ అనేలా లేకపోయినా పర్వాలేదని పిస్తుంది. వెన్నెల కిషోర్, సత్య, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి కామెడీ రోటీన్‌గా అనిపిస్తుంది. తమన్ పాటలు ఎక్కకపోయినా..బ్యాగ్రౌండ్ మాత్రం హైలెట్ అని చెప్పాలి. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
బ్యాడ్ నెరేషన్
రొటీన్ కామెడీ
తీర్పు :
అమర్ అక్బర్ ఆంటోని గురించి ఫైనల్‌గా చెప్పాలంటే రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రొటీన్ స్క్రీన్‌ప్లేతో అనవసరమైన కామెడీని చేర్చి ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేశారు. దీంతో వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న శ్రీను వైట్ల మరోసారి ప్రేక్షకులను నిరాశపర్చాడని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
Rating : 2.5