తమిళనాడు రాజధాని రాజధాని చెన్నైని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. గత మూడు వారాల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై నగరం నిండా మునిగిపోయింది. చిన్న పాటి వర్షం కురిస్తేనే.. చెన్నై నగరం నీటితో నిండిపోతున్నది.
ఇక, ఇదిలా ఉంటే… ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కూడా ఇదే విధంగా మారే అవకాశం ఉందని తెలుస్తున్నది. అమరావతి నదిపరివాహ ప్రాంతంలో ఉండటంతో పాటు.. భూకంప జోన్ లో ఉండటంతో.. అమరావతి గురించి టెన్షన్ మొదలైంది. భూకంపం వస్తే.. తట్టుకునే విధంగా నిర్మాణాలు నిర్మించవచ్చు.. కాని, వరదలు సంభవిస్తే.. పరిస్థితిఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది. పైగా అమరావతిలో రోడ్డు రవాణాతో పాటు జలరవాణ వ్యవస్థను కూడా డిజైన్ లో పొందుపరిచారు. డిజైన్ చేస్తే.. వరదలు సంభవించినపుడు.. అది మరింత ప్రమాదకంగా మారే ఆవకాశం ఉంటుంది. అమరావతి మరో చెన్నై లా కాకుండా ఉండాలని.. అందుకు తగినట్టుగా నిర్మాణాలు నిర్మించాలని కోరుకుందాం.