ప్లాన్ అదిరింది.. కట్టుబడి ఎప్పుడో..?

Monday, December 28th, 2015, 10:57:55 AM IST


అమరావతి మాస్టర్ ప్లాన్ రెడి అయింది. 9 పేర్లతో.. 9 నగరాలను అమరావతిలో నిర్మించే విధంగా ప్లాన్ రెడీ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం.. నిర్మాణాలు ఉంటాయట. గవర్నమెంట్, జస్టిస్, నాలెడ్జ్, ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం సిటీల పేరుతో 9సిటీలను నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి రాజధానిలో 9 ప్రాంతాలను సెలెక్ట్ చేశారు. ఇక, గవర్నమెంట్ సిటీలో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసంతో పాటు ఇతర ప్రభుత్వవిభాగాలకు సంబంధించిన కార్యాలయాలను నిర్మిస్తారు. జస్టిస్ సిటీలో హైకోర్ట్ తో పాటు హైకోర్ట్ జడ్జీల వసతి గృహాలను నిమిస్తారు. ఫైనాన్స్ సిటీ విషయానికి వస్తే.. వాణిజ్య భవనాలతో పాటు వాటర్ ఫ్రంట్ ప్లాజా, రిక్రియోషన్ ఐలాండ్ లను నిర్మిస్తారు. ఇక, నగరంలోని ఎక్కడినుంచైనా ఫైనాన్స్ సిటీకి చేరుకోవడానికి వీలుగా మెట్రో ట్రైన్ సౌకర్యం కూడా ఉంటుంది.

నాలెడ్జ్ పార్క్, హౌసింగ్ విశ్వవిద్యాలయం ను నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేస్తారు. 2050 నాటికి 1.20 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ఈ సిటీని నిర్మిస్తున్నది. ఇక భారీ స్టేడియంలను, అంతర్జాతీయ ఈవెంట్ లను నిర్వహించేందుకు వీలుగా స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తున్నది. సాంస్కృతిక, కళారంగాల అభివృద్ధి కోసం మీడియా సిటీని ఏర్పాటు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. ఇక, ఈ ప్లాన్ ను ప్రజల ముందు ఉంచి.. ప్రజల దగ్గరి నుంచి మార్పులు చేర్పులు కోరబోతున్నారట. ఇందుకు నెల రోజుల గడువు కూడా పెట్టారు. నెల రోజుల అనంతరం ఏవైనా మార్పులు ఉంటే సరిదిద్ది.. తుది ప్లాన్ ను రెడీ చేస్తారు. ఆ తరువాత నిర్మాణం చేపడతారని తెలుస్తున్నది. మరి ఆ నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో.. ఎప్పుడు భవనాలు రెడీ అవుతాయో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.