అమెరికాలో అరెస్టైన 200 మంది తెలుగువారు – కారణం తెలిస్తే షాక్ తప్పదు..!

Thursday, January 31st, 2019, 01:00:47 PM IST

అమెరికాలో 200మంది తెలుగువారు అరెస్ట్ అయిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది, నకిలీ పాత్రలు చూపించి అక్కడ నివాసం ఉంటున్న 600మందిని అరెస్ట్ చేసారు. వివరాల్లోకి వెళితే అరెస్టైన వారిలో కొందరు అమెరికన్ ఇండియన్స్ అయితే, మరికొందరు భారతీయులే. వందలాది విద్యార్థులు చట్టవ్యతిరేకంగా అమెరికాలో నివసించేందుకు వీరు తోడ్పడ్డారనే నేరం మీద యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ICE)విభాగం వీరిని అదుపులోకి తీసుకుంది. అలా విద్యార్థులు పేరుతో అక్రమంగా నివాసముంటున్నవారికి తోడ్పడుతున్న వారిని అరెస్ట్ చేసారు, వారిలో వర్జీనియాలో నివాసముంటున్న సురేష్ కందల(31), కెంటకీలో నివాసముంటున్న కర్నాటి ఫణిదీప్ (35), కరోలినాలో నివాసం ఉంటున్న ప్రేం రాంపీస (26), కాలిఫోర్నియాలో నివాసముంటున్న సంతోష్ సామా (28), పెన్సిల్వేనియాలో నివాసముంటున్న అవినాశ్ తక్కళ్ల పల్లి (28), డల్లాస్ లో నివాసముంటున్న అశ్వంత్ నూనె(26), అట్లాంటాలో నివాసముంటున్న నవీన్ ప్రతిపాటి (29), ఫ్లోరిడాలో నివాసముంటున్న కాకిరెడ్డి భరత్ (29) ఉన్నారు.విదేశాల నుండి విద్యార్థులను అమెరికాకు రప్పించి వారిని అక్రమంగా నివసించేలా చేస్తున్నారన్న ఆరోపణపై హోమ్ లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఏజంట్లు దేశవ్యాపితంగా గాలించి ఈ కుంభకోణాన్ని వెలికి తీశారు. ఈ తెలుగు యువకుల గ్యాంగ్ ఏవిధంగా ఫేక్ యూనివర్సిటీని ఉపయోగించి విద్యార్థులను అమెరికాకు అక్రమ రవాణచేస్తున్నారో, అదే విధంగా ఫేక్ యూనివర్సిటీని వలగా వేసి సెక్యూరిటీ అధికారులు ఈ కుంభకోణాన్ని చేధించి కుట్రదారులను అరెస్టు చేశారు. ప్రపంచంలోని పలు దేశాల నుండి విద్యార్థులను అమెరికా రప్పించేందుకు చాలా మంది ఫేక్ యూనివర్సిటీలను వాడుకుంటున్నారు, ఈ నేపథ్యంలో అధికారులు అదే “ఫేక్ యూనివర్సిటీ” మాస్టర్ ప్లాన్ ద్వారా నేరస్థులను ఆపులోకి తీసుకున్నారు

అధికారులు గుర్తించిన సదరు ఫేక్ యూనివర్సిటీకి ఆఫీస్ లేదు, స్టాఫ్ లేదు, చివరకు ఆఫీస్ బిల్డింగ్ కూడా లేదు, వేరొక ఆఫీస్ కాంప్లెక్స్ సెల్లార్ నుండి దీనిని నడిపించేవారు,తమ ఆఫీస్ కాంప్లెక్స్ లో ఓ యూనివర్సిటీ ఉందన్న విషయాన్నీ తెలుసుకున్న అక్కడి ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. విద్యార్థులను ఆమెరికా తీసుకువచ్చేందుకు వారికి ఇక్కడ ఆశ్రయం ఇచ్చేందుకు, ఇలా రిక్రూట్ చేసుకునేందుకు వీరంతా భారీగా డబ్బులు వసూలు చేసేవారు. ఈ యూనివర్శిటీ విద్యార్థులను దేశమంతా గాలించి పట్టుకున్నారని అమెరికా లోని ఇమిగ్రేషన్ న్యాయవాది రాహుల్ రెడ్డి అంటున్నారు. ఆ విధంగా దొంగ దారిలో రిక్రూట్ చేసుకున్న వారిని విద్యార్థులుగా చిత్రీకరించేందుకు ఈ నేరస్థులు ఫేక్ యూనివర్సిటీల నుండి దొంగ సర్టిఫికేట్లు పుట్టించేవారు. ఇలా ఫేక్ సర్టిఫికేట్లతో ఇమిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించేవారు.ఈ స్కామ్ ను చేధించేందుకు అమెరికా అధికారులు ఫార్మింగ్టన్ యూనివర్సిటీని కరెక్ట్ మార్గంగా ఎంచుకొని రంగంలోకి దిగారు. అధికారులు రిక్రూట్మెంట్ ఏజెంట్ల లాగా మారువేషంలో వెళ్లి మొదట సురేష్ రెడ్డి కందల, సామా సంతోష్ రెడ్డిలను అరెస్ట్ చేసారు. ఈ బ్యాచ్ ఒక్కొక్క విద్యార్థినుంచి 20 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేస్తూ వస్తున్నారని అధికారులు తెలిపారు .ఈ ఫేక్ యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించేది చదివి డిగ్రీలు సంపాదించేందుకు కాదు, అక్కడ స్టూడెంట్ వీసా పొంది ఆ తర్వాత వర్క్ ఆధరైజేషన్ సంపాదించి మెల్లిగా అమెరికాలో తిష్ట వేసేందుకు. మొత్తానికి ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఫేక్ యూనివర్సిటీని వాడుకొనే ఈ స్కామ్ ను బయటపెట్టారు.