హెచ్ 1 బీ వీసాలో సవరణలు తీసుకువచ్చి విదేశీ కంపెనీలకు షాక్ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకు వేశారు. విదేశీ ఉద్యోగులను తగ్గించి అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో హెచ్ 1 బీ వీసా చట్టానికి సవరణలు తీసుకుని రావాలని అమెరికా సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీంతో విదేశీ కంపెనీలకు షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధమయ్యారని సమాచారం. ఈ నేపధ్యంలో తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీ ఈ విషయాన్ని వెళ్ళడించింది.
దీంతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం బారత్ ఐటీ కంపెనీలకు పెద్ద దెబ్బే అని అభిప్రాయపడుతున్నారు. హెచ్ 1 బీ వీసాలో సవరణలు తీసుకుని వస్తే.. అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలతో పాటు.. మధ్యతరహా, చిన్న కంపెనీలకు చిక్కులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. గత చాలా ఏళ్ళుగా ఇండియాతో పాటు కొన్ని ఇతర దేశాల నుండి టెక్నాలజీ సంస్థలు తమ తమ ఉధ్యోగులను హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికాకు తీసుకెళుతున్నాయి. అయితే తాజాగా హెచ్ 1 బీ విధానంలో మార్పులు తీసుకుని వచ్చినట్లైతే.. వీదేశీ కంపెనీలలోని వేలమంది ఉధ్యోగులకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు. ఇక ట్రంప్ ప్రభుత్వం హెచ్4 వీసాలను తొలగించేదిశగా ఆలోచిస్తుందని సమాచారం. ఏది ఏమైనా ట్రంప్ ప్రభుత్వం భారత్తో సహా ఇతర దేశాలకు షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుందిని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.