అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ : 14 రాష్ట్రాలు, 90మర్డర్లు..!

Wednesday, November 28th, 2018, 12:47:06 PM IST

అమెరికాలోని టెక్సాస్ జైల్ వేదికగా నమ్మశక్యం కానీ కొన్ని కఠోర నిజాలు బయట పడుతున్నాయి. వాటి వివారాల్లోకి వెళితే 78 ఏళ్ళ వయసు గల శామ్యూల్ లిటిల్ అనే వృద్ధ ఖైదీ 90 కి పైగా హత్యలకు పాల్పడినట్టు సవ్యయంగా ఒప్పుకున్నాడు. అప్పటికే, లాస్ ఏంజెల్స్ లో ముగ్గురు మహిళల హత్యకు సంబంధించి దాదాపు అర్థ శతాబ్దంగా నడుస్తున్న ఈ కేసులో సామ్యూల్ 3యావజ్జీవ శిక్షలను అనుభవిస్తున్నాడు. అయితే ఇతను కనీసం 14 రాష్ట్రాల్లోని మహిళలను హత్య చేసి ఉంటాడని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇవెస్టిగేషన్ అధికారులు 30 హత్యలకు సంబందించిన సమాచారాన్ని శామ్యూల్ నుండి సేకరించారు. 1980లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన ముగ్గురు మహిళల హత్య కేసులో 2014లో సామ్యూల్ కి శిక్ష పడగా, ఈ సంవత్సరం ఏంఎస్ బ్రదర్ అనే వ్యక్తి హత్య కేసు గురించి శామ్యూల్ ను కాలిఫోర్నియా నుండి టెక్సాస్ కు తీసుకొచ్చారు పోలీసులు.

అధికారుల సమాచారం ప్రకారం జేమ్స్ హాలండ్ అనే ఇన్వెస్టిగేషన్ అధికారి, శామ్యూల్ తో సన్నిహితంగా ఉన్నట్టు నటించటంతో, అప్పటివరకు అమాయకంగా నటించిన అతను ఈ వరుస హత్యల గురించి వివరాలు బయటపెట్టాడని తెలుస్తుంది. శామ్యూల్ అంగీకరించినట్టు 90 హత్య కేసుల్లో అతనే దోషి అని రుజువైతే, 1980, 90లలో 49 హత్యలు చేసిన గ్యారీ రిడ్జ్ వే కంటే ఎక్కువ హత్యలు చేసిన వ్యక్తి అవుతాడు శామ్యూల్. ఇన్వెస్టిగేషన్ అధికారుల సుదీర్ఘ విచారణలో శామ్యూల్ తన హత్యల గురించి చెప్పిన నిజాలను విని అధికారులు సైతం విస్తుపోయారట. మహిళలను లైంగికంగా వేధించి చంపటంలో పైశాచిక ఆనందం పొందేవాడ్ని అని శామ్యూల్ చెప్పినట్టు, తల్లిని సైతం లైంగిక వాంఛతో చూసేంతటి క్రూరుడు శామ్యూల్ అని అధికారులు అన్నారు. ఈ కేసును ఏఫ్బీఐ తో పాటు పన్నెండు మందికి పైగా ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారించారని సమాచారం. శామ్యూల్ ప్రధానంగా వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలు, మెదక్ ద్రవ్యాలకు బానిసైన మహలలే లక్ష్యంగా హత్యలకు పాల్పడ్డాడని, వాటిని పొలిసులు పెద్దగా పట్టించుకోరు కాబట్టే శామ్యూల్ వారిని ఎంచుకున్నాడని అధికారులు తెలిపారు.