రాహుల్ పై అమిత్ షా విమర్శలు!

Sunday, December 21st, 2014, 12:54:23 AM IST


భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం కేరళలోని పాలక్కాడ్ లో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటాలియన్ కళ్ళద్దాలను ధరించడంతో దేశంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన అభివృద్ధిని సరిగ్గా చూడలేకపోతున్నారని విమర్శించారు. అలాగే రాహుల్ గాంధీ వెండి స్పూన్ తో పుడితే, ప్రధాని మోడీ దారిద్ర్యంలో జన్మించారని అమిత్ షా తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ అధికారం చేజిక్కించుకునే దిశగా కృషి చెయ్యాలని బీజేపీ కేరళ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపధ్యంలో ఆ అనుకూల వాతావరణాన్ని సద్వినియోగపరచుకోవాలని అమిత్ షా సూచించారు. ఇక ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరునెలల పాలనలో పదిసార్లు పెట్రోల్ ధరలను తగ్గించామని అమిత్ షా పేర్కొన్నారు.