నేడు ఏపీలో అమిత్ షా పర్యటన!

Thursday, January 8th, 2015, 08:31:23 AM IST


భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా పర్యటించనున్నారు. కాగా గతరాత్రి హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా ఈ రోజు సాయంత్రం వరకు తెలంగాణలో పర్యటించి అనంతరం రాత్రికి విజయవాడ చేరుకుంటారు. ఇక రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ లో భాజపాకు చెందిన ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. అటుపై సాయంత్రం జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు, పరిశీలకులతో సమావేశం కానున్నారు. ఈ నేపధ్యంగా అమిత్ షాకు ఘన స్వాగతం పలికేందుకు విజయవాడలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 2019 ఎన్నికలే లక్ష్యంగా ఎలాంటి వ్యూహాలను రచించాలనే అంశంపై నేతలకు దిశానిర్దేశకం చెయ్యడమేనని అమిత్ షా పర్యటనకు ముఖ్య ఉద్దేశ్యమని తెలుస్తోంది.