టీడీపీలోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వనున్న ఆనం బ్రదర్స్

Sunday, January 17th, 2016, 02:12:52 PM IST

ఏపీ రాజకీయాల్లో సపరేట్ ఇమేజ్ సంపాదించుకున్న నాయకులు ఎవరంటే అందరికీ గుర్తొచ్చేది నెల్లూరు ఆనం బ్రదర్స్. గత రెండు దశాబ్దాలుగా నెల్లూరు రాజకీయాలను శాసిస్తున్న వీళ్ళు కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పలు కీలక పదవులు అనుభవించారు. కానీ 2014లో కాంగ్రెస్ ఎపీని విభజించడం వల్ల పార్టీ పూర్తిగా నేలమట్టమైపోయింది. దీంతో నెల్లూరులో కూడా కాంగ్రెస్ పరిస్థితి అద్వానంగానే తయారవటం వల్ల వీళ్ళు తమ పూర్వపు పార్టీ టీడీపీలోకి మారిపోయ్యారు.

వీరి చేరిక ఇదివరకే ఖాయమైనప్పటికీ ఈరోజు ఆదివారం ఆనం సోదరులైన వివేకానంద రెడ్డి, రామనారాయణ రెడ్డి అఫీషియల్ గా దాదాపు 2000 మంది కార్యకర్తలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆద్వర్యంలో టీడీపీలో ఘనంగా రీ ఎంట్రీ ఇవ్వటానికి సన్నద్దమయ్యారు. నెల్లూరు టీడీపీలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు వీరికి సాదరంగా స్వాగతం పలికారు. వీరి చేరికతో ఇప్పటివరకూ టీడీపీ కి పూర్తి పట్టులేని నెల్లూరులో పార్టీకి మంచి బలం దొరికినట్టైంది.