ఇకనైనా మారండి ప్లీజ్

Wednesday, March 25th, 2015, 10:37:52 AM IST


ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును చూస్తుంటే… ఎవ్వరికైనా అసలు సభలో ఏం జరుగుతుందనే అనుమానాలు రాక మానవు. ప్రజలు ఓట్లు వేసి తమ సమస్యలపై చర్చించమని అసెంబ్లీకి పంపితే… అక్కడ నేతలు చేస్తున్నది ఏమిటి..? కొట్టుకోవడానికి… తిట్టుకోవడానికా..? అందుకైతే అసలు అసెంబ్లీకి వెళ్ళడం దేనికి. ప్రస్తుతం మన అసెంబ్లీలో జరుగుతున్న రాజకీయాలతో ప్రజలు విసుకు చెందుతున్నారు. ఇలాగైతే.. వచ్చే ఎలక్షన్లలో ఓటు వేయడం కష్టమే అవుతుంది. ఇకపోతే… సమస్యల గురించి చర్చించమని అంటే.. సొంత విషయాల గురించి తిట్టుకుంటూ… ఒకరిపై ఒకరు అవినీతి బురదజల్లుకుంటూ అసెంబ్లీ సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్.. కరప్టేడ్ రాజకీయాలకు స్వస్తిపలికేదెప్పుడు. రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించేదేప్పుడు. ఇప్పటికే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోవడంతో… ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా, ఆర్ధికంగా, రాజధాని పరంగా ఎంతో నష్టపోయింది. అంటే, ఒకప్పుడు అభివృద్ధి చెందిన మొదటి నాలుగు రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే… కేంద్రం కూడా రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ తీరును మార్చుకొని రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాలని ఆశిద్దాం.