పోలీసుల కళ్లెదుటే హైదరాబాద్ నడిబొడ్డున దారుణ హత్య..!

Thursday, November 29th, 2018, 03:14:11 PM IST

గత కొన్ని నెలల నుంచి తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అత్యంత దారుణ హత్యలకు అడ్డాగా మారుతుంది.ఒక దారుణ హత్యా సంఘటన మర్చిపోయే లోపే మరో దారుణ హత్య చోటు చేసుకుంటుంది.షకీల్ కురేషి అనే యువకుడిని అబ్దుల్ అనే వ్యక్తి పట్ట పగలు పాతబస్తీ నడిరోడ్డు మీదనే అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి చంపేశాడు.ఆ సమయంలో ఆ పక్కనే పోలీసులు ఉన్నా సరే వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు..వివరాల్లోకి వెళ్లినట్టయితే షకీల్ కూరేషి అనే యువకుడు గత కొద్ది రోజులుగా అబ్దుల్ యొక్క తల్లిని,సోదరిని అత్యాచారం చేసి చంపేస్తానని వేధిస్తూ బెదిరిస్తున్నాడని అందుకు గాను అబ్దుల్ ఆగ్రహానికి లోనయ్యి షకీల్ ను నడిరోడ్డు మీదనే అత్యంత దారుణంగా కత్తితో నరికి నరికి హతమార్చినట్టు తెలుస్తుంది.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.