మరొక నిర్భయ ఘటన : గుంటూరులో 9ఏళ్ళ బాలికపై అత్యాచారం !

Thursday, May 3rd, 2018, 11:55:46 AM IST

నిర్భయలాంటి చట్టాలు ఎన్ని వచ్చినప్పటికీ మహిళలు, అమ్మాయిల పై జరుగుతున్న అరాచకాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మనిషి మెదడు రాను రాను నీచాతి నీచంగా ఆలోచనలు చేస్తోంది. సభ్య సమాజం తల దించుకునేలా చిన్నారి బాలికలపై జరుగుతున్న అకృత్యాలు వింటుంటే మన హృదయం చెలిచిపోతుంది. ఇటీవల జరిగిన కథువా, వున్నావ్ ఘటనలను మరువక ముందే, అటువంటి ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి లో నిన్న జరిగింది. అభంశుభం తెలియని 9ఏళ్ళ బాలికపై సుబ్బయ్య అనే వృద్ధుడు దారుణంగా ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పూనుకున్నాడు.

బాలిక అరుపులు కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు సుబ్బయ్యను పట్టుకోబోగా అతడు తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలిక బంధువులు సుబ్బయ్య ను పట్టుకునే వరకు ఊరుకోమని నార్కట్పల్లి-దాచేపల్లి హైవే పై ధర్నా చేశారు. దానివల్ల దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడకి చేరుకున్న ఎస్ఐ నిందితుడిని నేడు ఎలాగైనా గాలించి పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు నిరసనను విరమించారు. కాగా ఈ ఘటనతో దాచేపల్లిలో నేడు స్వచ్చందంగా స్థానిక ప్రజలు బంద్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది……