ఆప్ కు సన్నిహితంగా బీజేపి వ్యతిరేక కూటమి..?

Saturday, February 7th, 2015, 12:31:34 AM IST


దేశవ్యాప్తంగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపి రాష్ట్రాలపై కన్నేసింది. ఇందులో భాగంగా, మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్ రాష్ట్రాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అక్కడ పాగా వేసింది. ముస్లింలు అధికంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విజయం సాధించపోయిన.. నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది బీజేపి. కాగా, ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో బీజేపి హవా కొనసాగుతున్నది. ఇక, యూపికి ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పాగా వేసేందుకు కృషి చేస్తున్నది. అందులో భాగంగానే, శారదా చిట్ ఫండ్ వ్యవహారంలో జరిగిన అవకతవకలను బయటకు లాగింది. దీంతో….కొంతమంది బెంగాల్ మంత్రులు కటకటాల వెనక్కు వెళ్ళవలసి వచ్చింది. 2016లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని బీజేపి భావిస్తున్నది. మొన్నటివరకు ఒక్కఎంపి సీటైన గెలవని బీజేపి, గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచి తన సత్తా చాటింది.

ఇక, బీహార్ విషయానికి వస్తే, వాజ్ పాయ్ ప్రధానిగా ఉండగా, జెడి (యు) ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధిగా మోడీని ప్రకటించడంతో… నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకి వచ్చి.. బీజేపికి వ్యతిరేకంగా బీహార్ రాష్ట్రంలో పోటీ చేశారు. అయితే, దేశమంతటా మోడీ హావా వీస్తుండటంతో బీహార్ లో జెడి (యు) సర్కార్ వేసిన ఎత్తులు ఫలించలేదు. బీహార్ లో బీజేపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నది. దీంతో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన అనుగ శిష్యుడు మన్జీ కు అధికారం అప్పగించారు.

జనతా పార్టీలు మోడీ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. జనతా పార్టీలు అన్ని కలిసి జనతా పరివార్ గా ఏర్పడి పోరాటం చేయాలని అనుకున్నారు. అందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికఅను వేదికగా చేసుకోవాలని అనున్నది. ఢిల్లీ ప్రజలు ఆప్ కు ఓటు వెయ్యాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసింది. ఇక సీపీఎం కూడా ఆప్ కే ఓటు వెయ్యాలని ఢిల్లీ ప్రజలను కోరింది. ఇది ఇలా ఉంటే, ఇప్పటికే జనతా పరివార్ గా ఏర్పడ్డ బీజేపి వ్యతిరేక పార్టీలు ఆప్ కు తమ మద్దతును తెలిపాయి.

అయితే, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ వారి మద్దతును తీసుకుంటుందా… ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఢిల్లీ గద్దెనెక్కి విమర్శనలు ఎదుర్కొన్న కేజ్రీవాల్ ఇప్పుడు కనుక వారి మద్దతును తీసుకుంటే.. అభాసుపాలవ్వక తప్పదు.