బాహుబలిని మెచ్చిన చంద్రులు..!

Tuesday, March 29th, 2016, 11:42:21 PM IST


అప్పట్లో తెలుగు వారికి ఒక్క రాష్ట్రమే ఉండేది.. ఏదైనా జాతీయ స్థాయిలో సినిమా తన సత్తాను చాటితే.. ఒక్క రాష్ట్రం పొగడ్తలతో ముంచేది. కాని, తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఇది ఒకరకంగా మనకు గర్వకారణమనే చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగుసినిమా పరిశ్రమ మాకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాయి. ఇకపోతే, సోమవారం రోజున కేంద్రం జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగు సినిమా బాహుబలి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో.. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రజలే కాకుండా అటు రాజకీయ నాయకులు కూడా బాహుబలిని మెచ్చుకున్నారు. తెలుగు సినిమాకు జాతీయ పురష్కారం రావడం తెలుగువారిగా గర్వించదగిన విషయమని చంద్రబాబు నాయుడు పేర్కొంటే.. బాహుబలి ఉత్తమ జాతీయ చలన చిత్రంగా నిలవడం ఆనందంగా ఉన్నదని కెసిఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. బాహుబలి ది బిగినింగ్ లాగే బాహుబలి కంక్లూషన్ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు కెసిఆర్ పేర్కొన్నారు.