ఏపీ బ్రాండ్ అంబాసిడర్ – చంద్రబాబు క్లారిటీ

Wednesday, October 1st, 2014, 12:18:34 PM IST


తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబసిడర్ గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను టీ-సర్కార్ నియమించుకుంది. దీంతో అందరి దృష్టి ఏపీ రాష్ట్ర బ్రాండ్ అంబసిడర్ ఎవరనేదానిపై ఆసక్తిమొదలైంది. ఇదే విషయంపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌ననీ బాబు ప్రకటించారు. తమకు కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ ఉండాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెలిపారు.

తెలంగాణలో టీడీపీ కార్యకర్తల నైతికస్థైర్యం దెబ్బతీసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్‌గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీలో చేరిన ఎంపీలకు పార్టీ సభ్యత్వం ఇవ్వలేదని, వారు సభ్యత్వం స్వీకరించిన వెంటనే ఎంపీ పదవులకు రాజీ నామా చేయిస్తానని చెప్పారు. చంద్రబాబు లేక్‌వ్యూ అతిథి గృహంలో మంగళవారం ఎలక్ట్రానిక్ మీడియా సీఈవోలు, సంపాదకులకు విందు ఇచ్చారు.