చెట్టు నీరు కార్యక్రమం ఓ అద్బుతం : ఏపి సిఎం

Friday, February 20th, 2015, 01:35:59 AM IST


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెట్టు నీరు కార్యక్రమం ఈరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చిత్తూరుజిల్లా తంబళ్లపల్లెలో ఈ కార్యక్రమం ప్రారంభించడం ఆనందగా ఉన్నదని చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లాలో 36శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయిందని… జిల్లాలో తాగు మరియు సాగునీటి సమస్య ఉన్నదని ఆయన అన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో భూగర్భజలాలను పెంచేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్టు సిఎం తెలిపారు. హద్రీనీవాలో 16.5 టిఎంసిల నీటిని నింపినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఇక మదనపల్లిలో రెండు రోజులకు ఒకసారి మంచినీరు ఇవ్వాలని అధికారులకు సూచించినట్టు చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేశారు.