తెలుగు రాష్ట్రాలలో శంకుస్థాపనలు.. ముఖ్యమంత్రులు బిజీ బిజీ..!

Wednesday, February 17th, 2016, 10:04:58 AM IST


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయానికి ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 300 కోట్ల రూపాయలతో ఈ సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. అమరావతిలోని వెలగపూడిలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. మూడు నుంచి నాలుగు నెలల కాలంలో ఈ సచివాలయాన్ని పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన మొత్తం ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అందరు ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.

ఇక తెలంగాణలో రాజ్ భవన్ ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇళ్ళనిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజ్ భవన్ లో ఈ ఉదయం శంకుస్థాపన జరిగింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర మంత్రులు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్ భవన్ లో వందకోట్ల రూపాయలతో ఈ ఇళ్ళను నిర్మిస్తున్నారు.