ఏపీలో ఇంజినీరింగ్ క్లాసుల తేదీ ఖరారు!

Saturday, June 27th, 2015, 03:36:12 AM IST


ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయిందని తెలిపారు. అలాగే జులై 2 నుండి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయని గంటా పేర్కొన్నారు. ఇక గతంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో క్లాసులు ప్రారంభం అయ్యేవని, ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరగా క్లాసులు ప్రారంభిస్తోందని గంటా శ్రీనివాసరావు వివరించారు. కాగా ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 73,072 భర్తీ చేశామని, ఏడు కళాశాలల్లో విద్యార్దులు చేరలేదని, త్వరలో రెండో విడత కౌన్సిలింగ్ కు తేదీలు ఖరారు చేస్తామని వెల్లడించారు.