మొదటిరోజు కలెక్షన్లు 2 లక్షల కోట్లు..!

Monday, January 11th, 2016, 01:09:22 PM IST


ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాగస్వామ్య సదస్సు మొదటిరోజు అద్బుతంగా నడిచింది. విదేశీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన సభ్యులు 32 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటన్నింటి విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సులో రెండో రోజైన ఇవాళ్ళ ఏపీ ప్రభుత్వం ఐటీ రంగంలో 49 ఎంవోయూలను కుదుర్చుకోనుంది.

నిన్న జరిగిన ఒప్పందాల్లో ఇంధన రంగంలో 22, పరిశ్రమల రంగంలో 6, గనుల రంగంలో 1 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ముఖ్యంగా భారత ఫోర్జ్ సీఎండీ బాబా కల్యాణి రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అందులో ఒకటి నెల్లూరులో 1200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న పరిశ్రమ, మరొకటి 135 కోట్లతో అనంతపురం జిల్లాలో చేపట్టబోతున్న ఎనర్జీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఉన్నాయి. ఈ పెట్టుబడులతో నవ్యాంద్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందని, బాబు అనుకున్న లక్ష్యాన్ని సులభంగానే చేరుకునేలా ఉన్నారని రాజకీయ, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.