తాత్కాలికానికే అంత… బాబు కాస్త నేలకు దిగు..!

Thursday, January 28th, 2016, 11:10:44 AM IST


ఆంధ్రప్రదేశ్ లో పాలన సౌలభ్యం కోసం సచివాలయ ఉద్యోగులను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలని చందబాబు నాయుడు ఇప్పటికే హుకుం జారీ చేశారు. జూన్ లోగా ఉద్యోగులు అంతా అమరావతికి వచ్చెయ్యాలని పేర్కొన్నారు. అయితే, సచివాలయ ఉద్యోగుల కోసం ఇప్పటికే బాబు ఇప్పటికే అలవెన్స్ సౌకర్యం, సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ విషయంపై కూడా చర్చిస్తున్నారు.

ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో సచివాలయం నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం సంకల్పించింది. అయితే, ఇది కేవలం తాత్కాలిక సచివాలం మాత్రమేనట. ఈ తాత్కాలిక సచివాలయం కోసం ప్రభుత్వం 180 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. తాత్కాలికం కోసం 180 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటని వాపోతున్నారు. సచివాలయం కోసం తాత్కాలిక భవనం నిర్మించే బదులు.. ఉన్న భావనాలనే వాడుకోవచ్చుకదా అని కొంతమంది అంటున్నారు.