హైదరాబాద్ వదిలి అమరావతి వెళ్ళమంటే అంత నొప్పి ఎందుకో..!

Wednesday, May 25th, 2016, 12:53:22 PM IST


ప్రభుత్వ ఉద్యోగం అంటే సకల సౌకర్యాలతో కూడిన చింతలేని జీవితం. భవిష్యత్తుకు ఫుల్ భరోసా. పెట్రోల్ దగ్గర్నుంచి పిల్ల ఉద్యోగాల వరకూ అన్నిటికీ ప్రభుత్వానిదే భాద్యత. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగిని, అతని కుటుంబాన్ని ప్రభుత్వం దత్తత తీసుకున్నట్టే. ఇంతా చేస్తున్నా కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించడం లేదు. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్ లో ఉన్న సచివాలయ ఉద్యోగులను ఆగష్టులోగా అమరావతి వెళ్ళాలని తీర్మానించారు. కానీ వీళ్ళు మాత్రం అక్కడ సౌకర్యాలు లేవు, మా పిల్లల్ని హైదారాబాద్ లో ఉన్న స్కూళ్ళల్లో ఫీజులు కట్టి చేర్పించేశాము. కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు, అక్కడ ఇళ్ళు, కనీస వసతులు సరిగ్గాలేవు అంటూ వంకలు చెబుతూ మార్చి వరకూ గడువు అడుగుతున్నారు.

సరే ఒకవేళ వీళ్ళు చెబుతున్న కష్టాలు సభబనే అనుకుంటే ప్రస్తుతం అమరావతి సచివాలయ నిర్మాణంలో పని చేస్తున్న కూలీలు, ఇంజనీర్లు, వాళ్ళ కుటుంబాలు అక్కడ ఎలా ఉంటున్నారు మరి. వాళ్ళ కోసం ప్రభుత్వం ఏమన్నా సపరేట్ ఏర్పాట్లు చేసిందా.. లేదు కదా. మరి తమ కోసం అంత చేస్తున్న ప్రభుత్వం కోసం ఆమాత్రం ఇబ్బంది తట్టుకోలేరా మన ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వం కూడా వాళ్లకు గట్టిగా చెబితే వచ్చే ఎన్నికల్లో కీలకమైన ఓట్లు పోతాయని వ్యవహారాన్ని నాంచుతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే అమరావతిలో పూర్తిస్థాయి ప్రభుత్వ యంత్రాంగ ఏర్పాటు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడం కష్టం.