ఇంతకీ జనాలు పవన్ కళ్యాణ్ ని నమ్మాలా.. జగన్ ని నమ్మాలా..?

Sunday, July 10th, 2016, 12:40:13 PM IST


ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న అతి పెద్ద ఆయుధం ఎన్నికలు, ఓటు హక్కు. ఎన్నికల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం సరైన కనబర్చకపోతే తరువాత వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రత్యాన్మాయయాన్ని ఎన్నుకోవచ్చు. కానీ ప్రత్యాన్మాయం విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేకపోతే ప్రజలు ఎవర్ని ఎన్నుకుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఏపీ ప్రజానీకం ఉన్నారు.

ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్నా, సాధ్యమైనంత వరకూ పనులు చేస్తున్నా భవిష్యత్తులో ఒకవేళ ప్రజలు టీడీపీని కాదనుకుంటే ప్రత్యాన్మాయంగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది పెద్ద ప్రశ్నగా తోస్తోంది. ఉన్న ప్రతిపక్షం వైసీపీ ఎప్పటికప్పుడు బలహీనపడుతూ సానుభూతిని మూటకట్టుకుంటోంది తప్ప పనులు చేస్తుందన్న నమ్మకాన్ని మాత్రం కలిగిచలేకపోతోంది. ఇక జనసేన పార్టీ చూస్తే ఇప్పటి వరకూ పూర్తిస్థాయి సంస్థాగత నిర్మాణాన్ని ఇంకా పూర్తి చేసుకోలేదు. దీంతో జనాలు జగన్ ని నమ్ముకోవాలా లేకపోతే పవన్ వెనుక నడవాలా అన్న డైలామాలో పడ్డారు. 2019 నాటికి ఈ రెండు పార్టీల్లో ఏది మెరుగ్గా కనబడితే దానికే ప్రజాదరణ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది.