మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే మృతి !

Sunday, September 23rd, 2018, 03:14:31 PM IST

విశాఖ ఏజెన్సీ ప్రాతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్య కు గురైయ్యారు. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సీవేరు సోము కూడా మరణించారు. 50మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల దాడిని విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌ ద్రువిక్రరించారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఈరోజు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామానికి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు. ఎమ్మెల్యేతో అరగంట సేపు చర్చించిన అనంతరం వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇక ఇటీవల ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీపై విషయంపై మావోయిస్టులు పలు సార్లు హెచ్చరించారు. ఈ క్వారీ తో పర్యావరణానినికి ముప్పు వాటిల్లుతుండంతో దాన్ని మూసివేయాలని డిమాండ్‌ చేశారు. అయినా ఎమ్మెల్యే వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముఫై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక కిడారి సర్వేశ్వరరావు ఇటీవల వైసీపీ నుండి టీడీపీ లోకి మారారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.