“అరవింద సమేత” బ్రేకీవెన్ మీద సోషల్ మీడియాలో రచ్చ.!

Wednesday, October 31st, 2018, 09:03:04 PM IST


అక్టోబరు నెల 11 వ తేదీన దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ”అరవింద సమేత వీర రాఘవ”.రాయలసీమ కథా నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తారక్ యొక్క అన్ని సినిమాలలాగే మొదటి రోజు రికార్డు కలెక్షన్లు నమోదు చేసుకుంది.చిత్రానికి కూడా మంచి టాక్ కూడా రావడంతో దానికి తోడు దసరా సెలవులు ఉండటంతో మంచి వసూళ్లనే ఈ చిత్రం అన్ని ఏరియాల్లోనూ రాబట్టింది అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్ల మీద సోషల్ మీడియాలో అభిమానుల మధ్య రచ్చ నడుస్తుంది.మొన్ననే అరవింద సమేత 100 కోట్లు షేర్ రాబట్టేసిందని,ఇప్పుడేమో 90 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిందని అభిమానులు కొట్టుకుంటున్నారు.మరికొన్ని చోట్ల అయితే ఈ చిత్రం కాస్త నష్టాలనే మిగిల్చేలా కనిపిస్తుందని మరో వార్త కూడా వస్తుంది.ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ హిట్ అనుకున్న ఈ చిత్రం పై ఇప్పుడు బ్రేకీవెన్ మచ్చలు పడుతున్నాయి.ఇంతకీ అసలు ఈ చిత్ర వసూళ్ల విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే చిత్ర నిర్మాత ఏదోక వార్త చెప్పాల్సిందే.